GROUP 2 MINI GRAND TEST - 02

గమనిక

1. ఈ Test లో ఉన్నటువంటి ప్రశ్నలు మొత్తం గత APPSC మరియు TSPSC పరీక్షలకు చెందినవి (Previous Questions).

2. ఈ Test లో Negative Marks కూడా ఉన్నాయి.

3. ప్రతీ తప్పు సమాధానమునకు 0.25 మార్కు తొలగించబడుతుంది. (1/4 Negative Marking).

4. ఇందులో ఇవ్వబడిన Previous Questions అన్నింటికీ, వాటి యొక్క “Key” ఆధారంగా సమాధానాలు ఇవ్వబడ్డాయి.

5. ఒకవేళ మీ దృష్టికి ఏదైనా సమాధానం తప్పుగా అనిపిస్తే, క్రింద ఉన్నటువంటి “CONTACT US" ద్వారా మాకు తెలియజేయగలరు.


1. సముద్రగుప్తుని అలహాబాదు స్తంభ శాసనంలోని “కౌరాళం” దేనిగా గుర్తించబడింది?
A. కొల్లేరు సరస్సు
B. చిలకా సరస్సు
C. పులికాట్ సరస్సు
D. కొండపల్లి వాగు

2. గుప్తుల పరిపాలనా కాలంలో వెలసిన ప్రఖ్యాత నలంద విశ్వ విద్యాలయానికి అధిపతిగా పనిచేసిన ధర్మపాల ఏ నగరానికి చెందినవాడు? 
A. బెనారస్
B. కాంచీపురం
C. మధుర
D. నాసిక్

3. బృహత్కథ ఏ భాషలో రాయబడింది?
A. సంస్కృతం
B. ప్రాకృతం
C. పైశాచి
D. పాళీ

4. రెండవ చంద్రగుప్తుని పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు?
A. హుయాన్ త్సాంగ్
B. ఇత్సింగ్
C. లాపింగ్
D. ఫాహియాన్

5. క్రిందివారిలో భక్తి ఉద్యమంతో సంబంధం లేని వారు ఎవరు?
A. శంకరాచార్య
B. రామానుజాచార్య
C. వల్లభాచార్య
D. శ్రీకంఠా చార్య

6. వేదాలను ఆంగ్లంలోనికి అనువదించిన ప్రసిద్ధ సంస్కృత పండితుడు మాక్స్ ముల్లర్ ఏ దేశానికి చెందినవాడు?
A. జర్మనీ
B. ఇంగ్లాండ్
C. ఫ్రాన్స్
D. అమెరికా

7. ఈ క్రింద పేర్కొన్న జంతువులలో ఏది అశోకుని స్థూపంలో లేదు?
A. ఎద్దు
B. జింక
C. గుర్రం
D. ఏనుగు

8. దళితులు మూల భారతీయులు అని, హరప్పా నాగరికతను రూపొందించిన వారు అని, గట్టిగా నొక్కిచెప్పినది ఎవరు?
A. బి. శ్యాంసుందర్
B. ఎ. ఎల్లయ్య గౌడ్
C. సి. జగన్నాథమ్
D. ఎం. క్రిష్ణయ్య

9. బైరవకోనలోని ఆలయాలు ఈ క్రింది మతానికి సంబంధించినవి?
A. శాక్తేయం
B. జైనం
C. వైష్ణవం
D. శైవము

10. గాంధార శిల్పకళ ఈ క్రింది వంశపు పోషణ లోనిది?
A. మౌర్య
B. శుంగ
C. కుషాణ
D. గుప్త

11. 1630 లో శివాజీ ఏ కోటలో జన్మించాడు?
A. కటపి
B. శివనేరి
C. సింహాగడ్
D. రాయ్ గడ్

12. ఒక ఢిల్లీ మొఘల్ చక్రవర్తి యొక్క భార్య, తిరుగుబాటుదారులకు ద్రోహం చేసే విధంగా, బ్రిటిష్ వారికి ఇన్ఫార్మర్ గా సహాయపడింది. ఆమె ఎవరు?
A. జన్నత్ మహల్
B. ఫాతిమా భేగం
C. ముంతాజ్ మహల్
D. హజరత్ మహల్

13. ఢిల్లీ సుల్తానుల పరిపాలనా కాలంలో “దివాన్ - ఇ - ఆరజ్” అనేది ఏ విభాగానికి సంబంధించినది?
A. సైనిక విభాగం
B. మతపరమైన విభాగం
C. ఆర్థిక విభాగం
D. సమాచార విభాగం

14. కరువు పీడిత ప్రాంత ప్రజలకు సహాయం అందించిన మొదటి సుల్తాన్ ఎవరు?
A. అల్లావుద్దీన్ ఖిల్జీ
B. మహమ్మద్ తుగ్లక్
C. ఫిరోజ్ తుగ్లక్
D. బాల్బన్

15. మియాన్ తాన్ సేన్ కు సంబంధించి ఈ కింది వాటిలో ఏది సరైనది కాదు?
A. తాన్ సేన్ హిందూ దేవతలపై ద్రుపద్ లను రచించాడు
B. తాన్ సేన్ తన పోషకులపై కీర్తనలు రచించాడు.
C. తాన్ సేన్ అనేది అక్బర్ చక్రవర్తి ఇచ్చిన బిరుదు
D. తాన్ సేన్ అనేక కొత్త రాగాలను సృష్టించాడు

16. ఈ క్రింది మొగల్ చక్రవర్తుల్లో ఎవరు ప్రాధాన్యతను సచిత్ర గ్రంథాల నుండి ఆల్బమ్ లకు, వ్యక్తిగత చిత్రాలను మల్లించారు?
A. అక్బర్
B. హుమాయూన్
C. షాజహాన్
D. జహంగీర్

17. బాబర్ ఆత్మకథ “తుజుకీ బాబరీ” మొదట ఏ భాషలో వ్రాయబడింది?
A. తుర్కిష్
B. ఉర్దు
C. పర్షియన్
D. అరబిక్

18. అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా కాలంలో, ఈ క్రింద పేర్కొన్న వాటిలో, గ్రామ లెక్కలను గణించే వారిని ఏమని పిలిచేవారు?
A. చౌధరి
B. పట్వారీ
C. ఖోట్
D. మఖడ్డం

19. వాస్తు కళారీత్యా అత్యంత పరిపూర్ణమైనదిగా గుర్తింపు పొందిన బులంద్ దర్వాజాను, ఏ మొఘల్ చక్రవర్తి తన యొక్క దండయాత్రల విజయ సూచకముగా నిర్మించెను?
A. ఔరంగజేబు
B. బాబర్
C. అక్బర్
D. హుమాయూన్

20. రైత్వారీ శిస్తు వస్తూలు పద్ధతిలోని ప్రధాన అంశము?
A. భూమి శిస్తు వసూలు చేసే అధికారం వేలం మూలంగా అధిక మొత్తం చెల్లించే వారికి చెందేది.
B. ఈ పద్ధతిలో భూమిశిస్తు ధన రూపంలో కాకుండా ధాన్య రూపంలో చెల్లించేవారు
C. భూమిశిస్తు ప్రభుత్వపరంగా జమీందార్లు వసూలు చేసేవారు.
D. భూమిశిస్తు రైతుల నుండి ప్రభుత్వమే నేరుగా వసూలు చేసేది.

21. ఆంగ్లేయులు బాంబేను ఆక్రమించుకున్నారు. అది మౌలికంగా ఎవరికి చెందినది?
A. ఫ్రెంచి
B. డేన్స్
C. డచ్
D. పోర్చుగీసు

22. సహాయ నిరాకరణోద్యమం రద్దు చేయుటకు గల కారణం ఏమిటి?
A. హోమ్ రూల్ ఉద్యమం
B. జలియన్ వాలాబాగ్ దురంతం
C. చౌరాచౌరీ సంఘటన
D. స్వరాజ్ పార్టీ స్థాపన

23. భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదాన్ని ఇచ్చినది?
A. మహాత్మా గాంధీ
B. జవహర్ లాల్ నెహ్రూ
C. బి.ఆర్. అంబేద్కర్
D. రాజేంద్రప్రసాద్

24. మహాత్మా గాంధీ, ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు.
A. బెల్గాం 1924
B. హరిపుర 1938
C. అమృత్‌సర్ 1919
D. కాన్పూర్ 1925

25. క్రిందివారిలో జాతీయ ఉద్యమ కాలంలో స్వరాజ్య పార్టీని స్థాపించినది ఎవరు?
A. పట్టాభి సీతారామయ్య
B. సి.ఆర్. దాస్
C. ఉమేష్ చంద్ర
D. సి‌. రాజగోపాలాచారి

26. 1922 లో “భిల్ సేవా మండలి”ని స్థాపించినది ఎవరు?
A. జేంట్స్ భిల్
B. రెహమా వాసవే
C. అమృత్ లాల్ దాస్ ధక్కర్
D. ధరిందర్ బయాన్

27.  సైమన్ కమీషన్ రిపోర్ట్ 1930 కి సంబంధించి ఈ క్రిందివాటిలో సరైనది ఏది?
A. ప్రావిన్స్ లో ద్వంద ప్రభుత్వం రద్దు
B. సింధ్, ఒరిస్సా ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు ప్రతిపాదన
C. కేంద్ర శాసన సభను ఏకసామ్య సూత్రంపై పునర్నిర్మించడం.
D. దిగువ సభ సభ్యులను ప్రతినిధులుగా పరిగణించి, వారికి ప్రావినెన్స్ కౌన్సిల్ నుండి ఎన్నుకోవడం

28. బెంగాల్ విభజన సమయంలోని జాతీయ కాలంలో “యుగాంతర్” ఎడిటర్ ఎవరు?
A. అరబిందో ఘోష్
B. భూపేంద్రనాథ్ దత్త
C. బిపిన్ చంద్రపాల్
D. మదన్ లాల్ థింగ్రా

29. ఈ క్రిందివాటిలో జాతీయ ఉద్యమ కాలంనాటి తీవ్రవాద విప్లవోద్యమంతో సంబంధంలేని వారు ఎవరు?
A. అజిత్ సింగ్
B. దీనానాథ్
C. సురేంద్రనాథ్ బెనర్జీ
D. భాయ్ బాలా ముకుంద్

30. ఈ క్రిందివారిలో ఎవరిని ఆంధ్ర శివాజీగా పేర్కొంటారు?
A. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
B. పర్వతనేని వీరయ్య చౌదరి
C. కట్టమంచి రామలింగారెడ్డి
D. కళ్ళూరి సుబ్బారావు

31. సూపర్ మూన్ అనగా?
A. భూమి, చంద్రుడు మరియు సూర్యుడు ఒక సరళ రేఖలో ఉండి, చంద్రుడు భూమికి దగ్గరగా ఉండటం
B. ప్రకాశవంతమైన చంద్రుడు
C. ఒకే నెలలో రెండు చంద్రులు
D. గ్రహణం విడిచిన వెంటనే ఉన్న చంద్రుడు

32. కింద పేర్కొన్న వాటిలో ఏది సునామీకి ప్రధాన కారణం?
A. సముద్ర గర్భంలో కొండచరియలు విరిగిపడటం
B. సముద్ర గర్భంలో భూ పగుళ్ల (ఫాల్ట్స్) కదలికలు
C. సముద్ర గర్భంలో అగ్నిపర్వత విస్ఫోటనం
D. సముద్ర గర్భంలో గనుల తవ్వకపు విస్పోటనం

33. తుఫాను లోని మేఘావృత రాశి పైకి ఎగసి ఈ క్రింది దానిని ఆక్రమించగలదు.
A. స్ట్రాటో స్ఫియర్
B. ట్రోపో స్పియర్
C. మెసో స్పియర్
D. లిథో స్పియర్

34. కిందివాటిలో ఏది ఒక ప్రదేశపు వాతావరణంపై పెద్దగా ప్రభావం చూపదు?
A. అక్షాంశం
B. రేఖాంశం
C. ఎత్తు
D. తీరం నుండి దూరం

35. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది?
A. అంగారకుడు
B. శుక్రుడు
C. భూమి
D. బృహస్పతి

36. క్రిందివాటిలో “గోండ్వానా భూమి”లో భాగం కాని ఖండం ఏది?
A. భారత ఉపఖండం
B. ఆఫ్రికా
C. దక్షిణ అమెరికా
D. యూరప్

37. వాతావరణంలోని ఈ పొర టెలీకమ్యూనికేషన్స్ లో ఉపయోగపడుతుంది?
A. స్ట్రాటో ఆవరణం
B. ట్రోపో ఆవరణం
C. మెసో ఆవరణం
D. ఐనో ఆవరణం

38. మాగ్మాలో సిలికా శాతం ఎక్కువగా ఉంటే?
A. మాగ్మా మెల్లగా ఘనీభవిస్తుంది
B. మాగ్మా ఘనీభవించదు
C. మాగ్మా ఘనీభవించే రేటు త్వరగా ఉంటుంది
D. సిలికా శాతం ఘనీభవనంపై ప్రభావం చూపదు

39. కిందివాటిలో విశ్వం మూలాన్ని గురించిన మహా విస్ఫోటన సిద్ధాంతం సమర్థించే ఆధారం ఏది?
A. విశ్వపు విస్తరణ
B. గ్రహాల భ్రమణం
C. ఇప్పుడు కూడా నక్షత్రాలు విస్ఫోటనం చెందటం
D. విశ్వం స్థిరత్వం దశలో ఉండటం

40. భూమికి ఏది సోదరి గ్రహం?
A. అంగారకుడు
B. శుక్రుడు
C. బుధుడు
D. శని

41. వాయు కాలుష్యం కిందివాటిలో ప్రధానంగా ఎక్కడ ఉంటుంది?
A. ట్రోపో స్పియర్
B. స్ట్రాటో స్పియర్
C. ఎక్సో స్పియర్
D. మెసో స్పియర్

42. ఆరావళి పర్వతం ఒక ...........
A. కలశ పర్వతం
B. పరిశిష్ఠ పర్వతం (అవశేష)
C. అగ్ని పర్వతం
D. ఖండ పర్వతం

43. వాతావరణంలోని ఏ పొర ఏకరూప సమాంతర ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది?
A. ఎక్సో ఆవరణం
B. ట్రోపో ఆవరణం
C. స్ట్రాటో ఆవరణం
D. ట్రోపో పాజ్

44. భారత్ మొట్టమొదట అంటార్కిటికా అన్వేషణ ఎప్పుడు ప్రారంభించింది?
A. 1975
B. 1980
C. 1981
D. 1971

45. సూర్యుని చుట్టూ ఉండే పొరల్లో చిట్టచివరి పొర?
A. క్రోమో స్పియర్
B. కరోనా
C. స్ట్రాటో స్పియర్
D. ఫోటో స్పియర్

46. సూర్యుని కాంతి భూమిని చేరేందుకు పట్టే కాలం?
A.  18.2 సెకండ్లు
B. 18.2 నిమిషాలు
C. 8.2 సెకండ్లు
D. 8.2 నిమిషాలు

47. స్ట్రాటో స్పియర్ లో ఉండే ఓజోన్ ను సాధారణంగా దేనితో కొలుస్తారు?
A. కిలోవాట్ అవర్
B. లీటర్లు
C. డోబ్సన్ యూనిట్
D. క్యూసెక్కులు

48. కింది వాతావరణ ప్రాంతాలలో 90 శాతం ఓజోన్ ఎక్కడ ఉంది?
A. ట్రోపో స్పియర్
B. స్ట్రాటో స్పియర్
C. థర్మో స్పియర్
D. మెసో స్పియర్

49. సముద్రపు జలాల సాంద్రత పెరిగేది ఎప్పుడు?
A. లోతు పెరిగి, ఉప్పుదనం తగ్గినప్పుడు
B. లోతు, ఉప్పుదనం తగ్గినప్పుడు
C. లోతు, ఉప్పుదనం పెరిగినప్పుడు
D. లోతు తగ్గి, ఉప్పదనం పెరిగినప్పుడు

50. ఇవి భారత ఋతుపవనాలను ప్రభావితం చేస్తున్నాయి?
A. జెట్ స్ట్రీములు
B. ధృవ తూర్పు పవనాలు
C. పశ్చిమ పవనాలు
D. స్థానిక పవనాలు

51. కిందివాటిలో అతిచిన్న మహాసముద్రం ఏది?
A. అట్లాంటిక్ మహాసముద్రం
B. ఆర్కిటిక్ మహాసముద్రం
C. హిందూ మహాసముద్రం
D. పసిఫిక్ మహాసముద్రం

52. అల్పపీడన ప్రాంతాన్ని ఈ కింది విధంగా పిలుస్తారు?
A. ప్రతిచక్రవాతం
B. పొగమంచు
C. సైక్లోన్
D. ఏదీకాదు

53. ఇది భూమి యొక్క పొరలన్నింటిలోనూ పెద్దది?
A. భూ పటలం
B. బాహ్య కేంద్ర మండలం
C. అంతర కేంద్ర మండలం
D. ప్రావారం

54. అన్ని గ్రహాలలోకెల్లా ప్రకాశవంతమైన గ్రహం?
A. శుక్రుడు
B. బుధుడు
C. శని
D. గురుడు

55. ఈ క్రిందివాటిలో ఏది ప్రకృతి శక్తుల వల్ల రూపాంతరం పొందిన శిలలు?
A. బసాల్ట్
B. చలవ రాయి (మార్బుల్)
C. అబ్రకం
D. గ్రానైట్

56. భారత ప్రామాణిక రేఖాంశం యొక్క విలువ ఎంత?
A. 84° 30E
B. 85° 30E
C. 82° 30E
D. 83° 30E

57. భారతదేశంలో ఏ తూర్పు తీర రాష్ట్రం పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది?
A. తమిళనాడు
B. ఆంధ్రప్రదేశ్
C. పశ్చిమ బెంగాల్
D. ఒడిషా

58. గల్ఫ్ ఆఫ్ మన్నార్ సాపేక్షంగా విస్తరించి ఉన్న ప్రాంతాన్ని గుర్తించండి?
A. పశ్చిమ గుజరాత్
B. పశ్చిమ కేరళ
C. తూర్పు తమిళనాడు
D. పశ్చిమ బెంగాల్ కు తూర్పు

59. ఈ కింది ఏ జత రాష్ట్రాలు ఉమ్మడి సరిహద్దును కలిగి లేవు?
A. ఛత్తీస్ గఢ్ మరియు ఉత్తరప్రదేశ్
B. రాజస్థాన్ మరియు పంజాబ్
C. హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ & కాశ్మీర్
D. మేఘాలయ మరియు మణిపూర్

60. భారతదేశం మరియు శ్రీలంక మధ్య, మన్నార్ అగాధంలో ఉన్న ద్వీపం ఏది?
A. శ్రీహరికోట
B. పంబన్
C. న్యూమూర్
D. మినికాయ్

61. షెడ్యూల్డ్ కులం అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు?
A. యం.కె. గాంధీ
B. సైమన్ కమీషన్
C. బి.ఆర్. అంబేద్కర్
D. సౌత్ బరో కమిటీ

62. ఆదిపత్య కులం అనే భావనను ఎవరు ప్రతిపాదించారు?
A. యోగేంద్ర సింగ్
B. ఎస్. సి. దూబే
C. మైసూర్ నర్సింహాచారి శ్రీనివాస్
D. గోవింద్ సదాశివ్ ఘుర్యే

63. జర్మన్ ఐడియాలజీ పుస్తక రచయిత ఎవరు?
A. మాక్స్ వెబర్
B. కార్ల్ మార్క్స్
C. జార్జ్ సిమ్మెల్
D. హెర్బర్ట్ మార్కస్

64. హింద్ స్వరాజ్ పుస్తక రచయిత ఎవరు?
A. లాల లజపతి రాయ్
B. యం.కె. గాంధీ
C. జవహర్ లాల్ నెహ్రూ
D. మదన్ మోహన్ మాలవీయ 

65. కనీస వేతనాల చట్టం ఎప్పుడు ఆమోదించబడింది?
A. 1950
B. 1982
C. 1952
D. 1948

66. ఒక సమూహం లేదా సంఘం కట్టుబాట్లను ఉల్లంఘించే ఏ ప్రవర్తననైనా ఏమని పిలుస్తారు?
A. అనుగుణ్యత
B. అతిక్రమణ
C. నేరం
D. ఉప సంస్కృతి

67. కిందివాటిలో సామాజికీకరణ మొదటి ఏజెన్సీ ఏది?
A. పాఠశాల
B. కుటుంబం
C. సంఘం
D. సహచర బృందం

68. సమాజంలోని పేదవారికి మూలకారణం
A. తక్కువ వేతనాలు
B. అసమానత
C. ఉత్పత్తిలో తగ్గుదల
D. పోషకాహార లోపం

69. జాన్ బ్రెమాన్ గ్రామీణ అధ్యయనాలు దేనిపై దృష్టి సారించాయి?
A. అనవిల్ భూ యజమానులు
B. పాటిదార్లు
C. హల్పాటి గిరిజన కులం
D. భూమిహార్లు

70. ఎ.యం. షా, కుటుంబం మరియు ............ మధ్య భావనాత్మక భేదం కోసం వాదించాడు?
A. సంఘం
B. బంధుత్వం
C. గృహం
D. వివాహం

71. తరవాద్ అని పిలువబడే నాయర్ ఉమ్మడి కుటుంబం దేనిపై ఆధారపడి ఉంది.
A. పితృవారసత్వ
B. మాతృవారసత్వ
C. ద్వైపాక్షిక
D. అంబిలినియల్

72. వివాహం ద్వారా జతపరచబడే బంధువులకు వాడే సాంకేతిక పదం?
A. కుటుంబ సంబంధం
B. గృహ సంబంధం
C. కిన్షిప్
D. అఫ్ఫిన్స్

73. రూరల్ ప్రొఫైల్ పుస్తక రచయిత ఎవరు?
A. సతీష్ దేశ్ పాండే
B. డి.ఎన్. మజుందార్
C. సురిందర్ ఎస్ తోడ్కా
D. ఎస్. సి. దూబే

74. కులానికి సంబంధించిన ఏడు సాంస్కృతిక లక్షణాలను వివరించిన రచయిత.
A. ఎ. బెట్లీ
B. జె.హెచ్. హట్టన్
C. లూయిస్ డ్యూమాంట్
D. పి. సోరోకిన్

75. మహిళల హక్కుల నేపథ్యంలో, 1885 నాటి రుఖ్మాబాయి కేసు ఈ అంశాల చుట్టూ తిరుగుతుంది.
A. స్త్రీల పని చేసే హక్కు
B. వైవాహిక హక్కు పునరుద్ధరణ
C. మహిళల ఆరోగ్య హక్కు
D. స్త్రీల విద్య హక్కు
Result: